ఎంపీ పొంగులేటి ఇళ్లల్లో ఐటీ సోదాలు

IT searches in MP's booths

IT searches in MP's booths

Date:18/096/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఆదాయపన్ను శాఖాధికారులు దాడులు జరిపారు. మంగళవారం ఖమ్మంతోపాటు హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లోగల పొంగులేటి ఇళ్లు, కంపెనీలపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండానే బడా కాంట్రాక్టర్గా ఉన్నారు. కాంట్రాక్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. గత సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లోనూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూసినా నిరాశే మిగిలింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తాను పోటీ చేయకుండా తన అనుచరులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక సీట్లు కేటాయించాలని ప్రయత్నించి భంగపడ్డారు.
ఇదిలా ఉండగా వైఎస్ఆర్సిపి నుంచి టీఆర్ఎస్ పార్టిలో చేరిన సమయంలో భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్నారనే విమర్శలు విన్పించాయి.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పలు కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి పనులకు పొంగులేటి కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న పొంగులేటిపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Tags:IT searches in MP’s booths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *