వరి ధాన్యం లో తాలు తేమ శాతం లేకుండా చూసుకోవాలి-వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
వరి ధాన్యంలో తాలు తేమ శాతం లేకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారి నాగార్జున్ రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించి రైతులతో వారు మాట్లాడారు.వరి ధాన్యం పండించిన ప్రతి రైతు కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలని సూచించారు. తాలు తీయకుండా ధాన్యం నింపరాధని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. తేమ శాతం పరీక్షించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. రైతులు తమ ధాన్యం నాన్యతగా తీస్కరావాలని సూసించారు . రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తావని అధైర్య పడవద్దని రైతులకు సూచించారు. వీరి వెంట సింగిల్ విండో సీఈవో పాండు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Tags; It should be ensured that there is no moisture content in rice grain – Agriculture Officer Nagarjuna Reddy

