పచ్చదనంతో కూడిన అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి –  జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల ముచ్చట్లు :

జిల్లాలో రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసలలో మొక్కలను నాటి పచ్చదనంతో కూడిన అందమైన జగిత్యాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  మంగళవారం జగిత్యాల నుండి థరూర్ క్యాంప్, రాజరాంపల్లి, నూకపల్లి, మాల్యాల X  రోడ్డు, ముత్యంపేట, దొంగలమర్రి, పుడూరు, తుర్కకాశీనగర్, రైల్వే ట్రాక్ వరకు జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 కి ఇరువైపులా ఉపాధిహామీ కూలీల ద్వారా చేపడుతున్న మొక్కలు నాటుటకు తొవ్వుతున్న గుంతలు పనులను పరిశీలించి తగు  సూచనలు ఆదేశాలు జారీ చేశారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, రోడ్డుకు కొంత దూరంలో మొక్కలను నాటాలని, గతంలో నాటిన మొక్కల మధ్య దూరం ఎక్కువగా లేకుండా గుంతలను      ఏర్పాటు చేయాలని, చిన్న మొక్కలు కాకుండా పెద్ద మొక్కలను నాటేలా చూడాలని, మొక్క పరిమాణాన్ని బట్టి గుంతలను తవ్వాలని సూచించారు.  కొన్ని చోట్ల మొక్కలు సరిగా లేక పోవడం, గతంలో నాటిన మొక్కలు వంగిపోవడం, ట్రీగార్డ్స్  పడిపోవడం వంటివి చాలా చోట్ల జరిగాయని,  వాటిని పునరుద్దరించాలని సూచించారు. రోడ్డును ఆనుకుని గడ్డి చెత్త పెరుకుపోవడంతో వాటిని తొలగించడానికి ఉపయోగిస్తున్న బ్లెడ్ ట్రాక్టర్లు  ఎక్కువ లోతుగా కాకుండా చెత్త, గడ్డిని మాత్రమే  తోలగించేలా చూడాలని అన్నారు. జగిత్యాల నుండి తుర్కకాశీనగర్ కొడిమ్యాల మండలం రైల్వే ట్రాక్ వరకు జిల్లా బోర్డర్ ముగింపు వరకు మార్గమధ్యంలో రహదారులకు ఇరువైపులా చేపడుతున్న గుంతల పనులు మరియు మొక్కల పెరుగుదల  ఏడో విడత హరితహారంలో నాటవలసిన మొక్కల వివరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డీఏ వినోద్ కుమార్, జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల ఎంపీడీవోలు, మండల ప్రత్యేక  అధికారులు, ఎంపీవోలు, సెక్రటరీలు, ఈజీఎస్ సిబ్బంది, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:It should be made a beautiful district with greenery – District Collector G. Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *