మాటరాని మౌనమిది

హైదరాబాద్ ముచ్చట్లు:


తమ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ టాక్ రావడం పట్ల మాటరాని మౌనమిది చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.ఈ చిత్ర యూనిట్ విశాఖ నగరంలో ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ సినిమాను చూసి సందడి చేసింది.మాటరాని మౌనమిది తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో తాము పడిన కష్టమంతా మర్చిపోయామని పేర్కొన్నారు. కామెడీ తో పాటు థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ లో చూపించిన సరికొత్త లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని అన్నారు. సంగీతంతో పాటు చిత్రంలోని పాటలు ప్రేక్షకుల మనసును దోచుకున్నాయని తెలిపారు.
విశాఖ, అరకు, విజయనగరం ప్రాంతాల్లో గల అద్భుతమైన లొకేషన్ లో చిత్రీకరించిన తమ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విజయపదంలో దూసుకుపోతుందని చెప్పారు. తమ చిత్రం సరికొత్త కథనంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోందని తెలిపారు. విడుదలైన రోజునే ఉభయ రాష్ట్రాల్లో తమ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినందుకు చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి కథ బలం ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు గాయకుడు ఆలీ ఓ పాట పాడి ఉర్రూతలూగించారు.

 

Tags: It was a speechless silence

Leave A Reply

Your email address will not be published.