డబ్బుతోనే  కొనేశారు…300 కోట్లు ఖర్చు పెట్టారు

Date:23/02/2021

తిరుపతి ముచ్చట్లు:

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయాలు కలుషితం అయ్యాయని.. అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేస్తారనుకుంటే పొరపాటే అన్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. వాళ్లే ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చూసి వైఎస్సార్‌సీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమన్నారు. అదంతా దొంగ మాట అన్నారు. డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని.. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని వ్యాఖ్యానించారు.చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని.. అయినా వైఎస్సార్‌సీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు జేసీ. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారన్నారన్నారు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి.. వైఎస్ జగన్ ఎలాంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. సీఎం జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లని..ఇది ఎంతవరకు నిజమో.. అబద్ధమో.. తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణ పెద్దపల్లిలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్యపై దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; It was continued with money … 300 crores was spent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *