ఈటల జమునా డైరక్ట్ ఎటాక్

కరీంనగర్  ముచ్చట్లు:
నిన్నటి వరకూ భర్త చాటు భార్యగా, హచరీస్ వ్యాపారిగా మాత్రమే జీవనం సాగించారు. ఎన్నికలప్పుడు మాత్రం తన పతిదేవున్ని కనికరించాలని సతిగా ప్రచారం చేసేవారు. కానీ, ఇప్పుడామె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఓ వైపున మాటల తూటాలు పేలుస్తూ మరో వైపున జనంలోకి చొచ్చుకుని వెళుతున్నారు. ఇంతకీ ఎవరావిడ? అసలేం చేస్తున్నారు? ఉన్నట్టుండి తన వాక్చాతుర్యంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారెందుకు అంటే ఈ స్టోరీ చదవాల్సిందే..ఈటల జమునా రెడ్డి ఇప్పుడు హుజురాబాద్‌లోనే కాదు రాష్ట్రంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. నిన్నటి ఎన్నికల వరకూ తన భర్త రాజేందర్ గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు. హుజురాబాద్‌కు వచ్చినా తనకున్న అతికొద్ది మంది ఫ్రెండ్స్‌తో మాత్రమే టచ్‌లో ఉండేవారు. ప్రచారంలో కూడా భర్తతో కాకుండా తన సంతానంతో కలిసి తిరిగే వారు. కానీ, ఇప్పుడామె స్టైల్ మార్చేశారు. కదనరంగంలోకి దూకానన్న సంకేతాలు ఇస్తున్నారు. ర్యాలీల్లో పాల్గొంటున్నారు. మీడియా ముందు విమర్శలు చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. గత నెలలో జరిగిన అసైన్డ్ భూముల వ్యవహారంలో మీడియాతో మాట్లాడిన జమునమ్మ ప్రభుత్వంపై తన వ్యాఖ్యలతో అస్త్రాలను సంధించారు. ఇప్పుడు రెండు రోజులుగా తన సొంత మండలమైన కమలాపూర్‌లో పర్యటిస్తున్నారు. మెట్టింటి మండల ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దుయ్యబడుతున్నారు. తమపై ప్రభుత్వం కక్ష్య కట్టిందని చెప్తున్నారు. గతంలో ఏనాడూ లేని విధంగా ర్యాలీలో కూడా పాల్గొనడం విశేషం.హుజురాబాద్‌కు జరగనున్న ఉప ఎన్నికల్లో జమునమ్మ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈటల ఎపిసోడ్ జరిగిన మొదట్లో ఇక్కడి నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణి సరోజనమ్మ పోటీ చేస్తారని టీఆరెఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ అదే నిజమైతే ఈటలకు బదులుగా జమునా రెడ్డిని బరిలో నిలిపే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదనలు వినిపించాయి. మరోవైపు ఇటీవలె బీజేపీలో చేరిన ఈటలకు వేరే పదవిని కట్టబెడ్తారన్న ప్రచారం ఈటల వర్గంలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో జమునమ్మను పోటీ చేయిస్తారని అంటున్నారు.ఈటల వ్యూహంలో భాగంగానే జమునా రెడ్డి పోటీ చేసేందుకు సమాయత్తం చేస్తున్న సంకేతాలు పంపిస్తున్నారన్న కామెంట్స్ చేస్తున్నారు కొందరు. అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ చాలా మంది పేర్లను తెరపైకి తీసుకొచ్చింది. ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ నాయకులను జిగ్‌జాగ్‌లో పడేసే స్కెచ్ ఈటల వేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో మరో అంశం కూడా ఈటల మదిలో ఉండి ఉంటుందని అంటున్నారు ఆయనతో సన్నిహితంగా మెదిలిన వారు. ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన ఈటలకు ఆయన ఎత్తులు, పై ఎత్తులపై పట్టు ఉండటంతో అందుకు తగ్గ ప్లాన్‌తోనే ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల వాతావరణానికి ముందు బలంగా ఉన్న అభ్యర్థులను కూడా వీక్ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేస్తుంటారు. అలాంటి ఎత్తుగడలను తిప్పికొట్టడంలో భాగంగానే ఈటల తన భార్యను రంగంలోకి దింపి తనపై ఉన్న సానుభూతిని, ఓటు బ్యాంకును డైవర్ట్ కాకుండా చూసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈటల జమునా రెడ్డి డైరెక్ట్ ఎంట్రీతో మైండ్ గేమ్ స్టార్టయిందా లేక ఆమె క్యాండిడేట్ కాబోతున్నారా అన్నదే ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Itala Jamuna Direct Attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *