కాలం  చెల్లిన ఆటోలతో అధోగతే

It's too late for cars

It's too late for cars

Date:18/08/2018
వరంగల్ ముచ్చట్లు:
పిల్లలను తీసుకెళ్లే ఆటోల స్థితిగతులు తెలుసుకోవడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. ఒక్క ఆటోలో పరిమితికి మంచి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు. డ్రైవర్‌కు కనీస అర్హత ఉందా ? లేదా తాగి డ్రైవింగ్ చేస్తున్నాడా గమనించడం లేదు.
కాలం చెల్లిన వాహనాలను ఉపయోగిస్తూ డ్రైవర్ల నిరక్షం కారణంగా రోజు ఎన్నో ఆటోలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. పిల్లలను నమ్మకంగా డ్రైవర్‌లకు అప్పగించిన తల్లిదండ్రులు ఆపై డ్రైవింగ్ వారు వాహనాల కండిషన్‌పై దృష్టి పెట్టడం లేదు.
ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తే పిల్లలు క్షేమంగా ఇంటికి కొస్తారన్న విషయాన్ని మరిచిపోవద్దు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న, ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిన ఆటోల అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వారు తమ పిల్లల భవిష్యత్తుకై ఆరాటపడుతున్నారు తప్ప చిన్న చిన్న విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు.
బడి పిల్లల భద్రతకై ట్రాఫిక్ పోలీసుల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే చర్యల కన్న, ముందు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నగరంలో వందల కొద్ది స్కూళ్లు ఉన్నాయి.
రోజుకు ఎన్ని ఆటోలలో పిల్లలను బడికి తీసుకెళ్తున్నారు. వారి ఆటోల వివరాలను కూడా పోలీసుల ఆరాతీయాల్సిన అవసరం ఉంది.నగరంలోనే కాకుండా మారుమూల ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు ఆటోలను వాడుతున్నారు.
ఆటోలో పరిమితికి మంచి విద్యార్థులను తీసుకెళ్తున్న రోడ్డు రవాణా శాఖ అధికారులు కానీ పట్టించుకున్న దాఖాలాలు లేవు. కాలం చెల్లిన ఆటోలను చూస్తు సీజ్ చేయలేకపోతున్నారు. అధికారుల నిర్లక్షం  వల్ల ఎంతో భవిష్యత్తును కలిగిన విద్యార్థులు ప్రాణాలను బలికావాల్సి వస్తోంది.
మీ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోలకు సంబంధించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా, లేదా అడిగి తెలుసు కోవాలి. వాహనంలో పరిమితిమించి ఎంత మందిని విద్యార్థులను తీసుకెళ్తున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకెళ్తుంటే మీరు డ్రైవర్లను హెచ్చరించారు.
లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కొందరు డ్రైవర్లు మద్యం తాగి వాహనా లను నడుపుతున్నారు. దీనిని తల్లిదండ్రులు దృష్టి సారించాలి. డ్రైవర్ ఆటోలకు ఇరువైపుల స్కూల్ బ్యాగులను వేలాడదీయుట ప్రమాదం. ఇలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి. కాలం చెల్లిన వాహనాల్లో పిల్లలను పంపించవద్దు.
Tags: It’s too late for cars

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *