టాస్క్ ఫోర్సు అదుపులో జబర్థస్ నటుడు హరి

Jabbar's actor Hari in the task force

Jabbar's actor Hari in the task force

 Date:17/07/2018
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని ఎర్ర చందనం రవాణ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్ లో జబర్థస్ నటుడు హరి  లొంగిపోయాడు. హరిని  టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు మంగళవారం విచారించారు. తన న్యాయవాదితో కలిసి టాస్క్ ఫోర్స్ కార్యాలయంకు చేరుకున్న హరి కాంతారావుకు తన గతమంతా వివరించాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో గత కొన్నిరోజుల ముందు హరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హరి మాట్లాడుతూ  ఎర్రచందనం అమ్మి కోట్ల రూపాయలు సంపాదించలేదు. ఒక కానిస్టేబుల్ నాపై కావాలనే కేసులు పెట్టిస్తు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అనారోగ్యంతో  ఉన్న అమ్మను కాపాడుకోవడానికే  ఒకసారి మాత్రమే ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశానని అంగీకరించాడు. ఆ తరువాత నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హైదరాబాద్ లోనే ఉంటున్నానని అన్నాడు.
టాస్క్ ఫోర్సు అదుపులో జబర్థస్ నటుడు హరి https://www.telugumuchatlu.com/jabbars-actor-hari-in-the-task-force/
Tags:Jabbar’s actor Hari in the task force

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *