జబర్ దస్త్  స్మగ్లింగ్

Jabber Dust Smuggling

Jabber Dust Smuggling

Date:13/07/2018
తిరుపతి ముచ్చట్లు:
మై హూ రెడ్‌శాండిల్ డాన్ అంటున్నాడు జబర్దస్త్ ఆర్టిస్ట్. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో టాస్క్‌ఫోర్స్‌కు మోస్ట్‌ వాంటెడ్‌లా మారాడు. ఇదంతా రీల్ లైఫ్‌లో అనుకుంటే పొరపాటే.. రియల్‌ లైఫ్‌లోనే. బతుకుదెరువు కోసం ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పుడు ఏకంగా సినిమాలకే ఫైనాన్స్ స్థాయికి ఎదిగిపోయాడట. తిరుపతిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తీగలాగితే.. టాలీవుడ్‌ వరకు డొంక మొత్తం కదిలిందట. ఈ కేసు మొత్తాన్ని బయటకు లాగే పనిలో ఉన్న పోలీసులు.. ఈ డాన్‌ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించింది. అసలు స్టోరీలోకొస్తే.. తిరుపతికి చెందిన ఈ ఆర్టిస్ట్ పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్‌కు వచ్చాడు. ముందు టీవీ సీరియల్స్‌లో చిన్న, చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. మెల్లిగా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈజీ మనీ కోసం అలవాటు పడి ఎర్రచందనం స్మగ్లర్‌గా మారాడట. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో చెట్లను నరికి అక్రమంగా సరిహద్దులు దాటించేస్తున్నాడు. బెంగళూరు, చెన్నైలో ఉన్న ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో సంబంధాలు పెంచుకొని.. రూ.కోట్లకు పడగలెత్తాడు. ఈ స్మగ్లింగ్‌పై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పక్కా ఆధారాలను సంపాదించిందట. అతడిపై 14కుపైగా కేసులు నమోదు చేశారట. ఎర్రచందనం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ మధ్య సినిమాలకు ఫైనాన్స్ చేయడం కూడా ప్రారంభించాడట ఆ ఆర్టిస్ట్. ఈ మధ్యే రిలీజైన శంభో శంకర సినిమాకు ప్రొడ్యూస్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆర్టిస్ట్‌కు సహకరించిన వారి చిట్టాను కూడా పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇండస్ట్రీలోని ఒకరిద్దరికి కూడా ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. వారి వివరాలను కూడా బయటకు లాగే పనిలో ఉందట. ఈ రెడ్ డాన్‌ను పట్టుకోవడంపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఫోకస్ పెట్టింది. స్పెషల్ టీమ్‌లను కూడా రంగంలోకి దించింది. చిత్తూరు జిల్లాతో పాటూ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా గాలిస్తున్నారు. పోలీసుల మోస్ట్ వాంటెడ్ కావడంతో.. అతడు కూడా తప్పించుకొని తిరుగుతున్నాడట. ఎక్కడికి వెళ్లినా ప్రైవేట్ సెక్యూరిటీని వెంటబెట్టుకెళ్తున్నాడట. ఎక్కడా 15 నిమిషాలకు మించి కూడా ఉండకుండా మకాం మారుస్తూ ఉంటాడట. అతడి పేరు కూడా చెప్పేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు నిరాకరిస్తున్నారు.
జబర్ దస్త్  స్మగ్లింగ్ https://www.telugumuchatlu.com/jabber-dust-smuggling/
Tags:Jabber Dust Smuggling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *