బైపాస్ కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టిన జే ఏ సీ..
-అధికారుల తీరుపై అసహనం.
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా వి.కోటలో బైపాస్ రోడ్డు మండలం మీదుగనే వేయాలన్న ఢిమాండుతో జే ఏ సీ నేతలు రిలే నిరాహార దీక్షకు దిగారు. గత 31 రోజులుగా వివిధ మార్గాల ద్వారా గాంధేయ మార్గంలో సంతకాల సేకరణ చేపట్టి సర్పంచ్ నుండీ సీఎం దాకా వినతులు పంపినా స్పందించక పోవడం దారుణమని జే ఏ సీ కార్యదర్శి ఇనాయతుల్లా ఆవేదన వ్యక్తం చేశారు..
పట్టణానికి తూర్పు దిశగానే బైపాస్ కావాలని మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలు.. మండల పరిషత్ ఏకగ్రీవంగా తీర్మాణాలు పంపినా కలెక్టర్ చర్య తీసుకోక పోవడం బాద్యతా రాహిత్యమన్ని వైసీపీ జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అభ్భూఖాన్ అన్నారు.
వి.కోటకు మెుదటగా మంజూరైన ప్రతిపాదనను పక్కన పెట్టి కొందరు స్వార్థ అధికార నేతలు కకృతిపడి డిల్లీ లోని హైవే అధికారులకు ముడుపులు ముట్టజెప్పి ఎవరికీ తెలియకుండా ఆలైన్మెంట్ కర్నాటక మీదుగా మార్చేశారని విసీకే పార్టీ రాష్ట్రఆధికార ప్రతినిధి గణపతి ఆరోపించారు.

Tags; JAC took relay hunger strike for bypass.
