అవ్వ, తాతల మోములో చిరునవ్వే జగన్ లక్ష్యం -ఎంపీపీ మోహిత్ రెడ్డి
పేదల ఆర్దిక స్వాలంబన ప్రభుత్వ ధ్వేయం: తిరుపతి రూరల్ మండల
రామచంద్రాపురం ముచ్చట్లు:
రాష్ట్రంలోని ప్రతి అవ్వ, తాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిరునవ్వుతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే , తుడా చైర్మన్, టిటిడి పాలకమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపిపి మోహిత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వైయస్సార్ అందించిన కానుక పంపిణీ కార్యక్రమం రామచంద్రపురం మండలం లో ఆదివారం అనుపల్లి సచివాలయంలో తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి, రామచంద్రపురం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, సింగిల్విండో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మండల అడ్వైజరీ కమిటీ చైర్మన్ వెంకట రెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి, ఎంపీడీవో రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. లబ్ధిదారులు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, పెన్షన్ ను 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచి పెన్షన్ లబ్ధిదారుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి సంతోషాలను ముందే తీసుకు వచ్చారన్నారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు మాత్రమే 2 వేల రూపాయల పెన్షన్ అందజేసి ప్రజలను మభ్య పెట్టారన్నారు.
అధికారంలోకి వస్తే పెన్షన్లను దశలవారీగా 3 వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు.ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న పెన్షన్లను 2,250 రూపాయలకు పెంచి ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారన్నారు. దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కరోనా సమయంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ప్రజల కోసం తపించే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో 12వేల లక్షల మందికి మాత్రమే పింఛన్ ఇస్తుండగా నేడు సుమారు 19 వేల లక్షల మందికి ఇస్తున్న ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. ముఖ్యమంత్రికి పెద్దలంటే అమితమైన గౌరవం అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ను ఒకటవ తారీఖునే మీ ఇంటికి వచ్చి అందజేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. కష్ట పరిస్థితుల్లో సైతం సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం మాత్రమే అందించిందన్నారు. మీ గడప వద్దే సచివాలయం ఏర్పాటు అన్ని సంక్షేమ ఫలాలు సకాలంలో అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి దే అన్నారు. సమావేశం అనంతరం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో ఉప సర్పంచ్ స్వాతి రెడ్డి వైకాపా నాయకులు దొరస్వామి రెడ్డి, నాదముని, శంకర్ రెడ్డి, వార్డు సభ్యులు, వాలంటిర్లు, పంచాయతీ అధికారులు పింఛనుదారులు పాల్గొన్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Jagan aims to smile at grandma and grandpa candle -MPP Mohit Reddy