ఓటు వేసిన జగన్, మంత్రులు

విజయవాడ  ముచ్చట్లు:

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు రోజా, తానేటి వనిత, బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ తరపున బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించారు.ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 151 మంది వైఎస్సార్‌ సీపీకి చెందిన వారు కాగా 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒకరు జనసేనకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్‌ స్థానాలుండ గా 22 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ సభ్యులున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా వైసీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అనారోగ్య కారణంతో తన ఓటును తెలంగాణ అసెంబ్లీలో వినియోగించుకుంటానని ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నారు.

 

Tags: Jagan and ministers who voted

Leave A Reply

Your email address will not be published.