కేసుల మాఫీకోసం కేంద్రం చుట్టూ జగన్

Jagan around the center of the cases

Jagan around the center of the cases

Date:21/09/2018
విజయవాడ  ముచ్చట్లు:
రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు రావాలి అనేది వివరిస్తూ 4 పేజీల పుస్తకాన్ని ఎమ్ ఎల్ సి బుద్దా వెంకన్న విడుదల చేసారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పుస్తకం లో 15 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం.  జగన్మోహన్ రెడ్డి కి అనేక అక్రమాలు ఉన్నాయి కానీ కేవలం 15 మాత్రమే మేము  తెలియచేయాలని అనుకున్నామని అన్నారు.
మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం కోసం ఎన్డీయే నుండి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నాం. దేశంలో ప్రజలంతా మోడీని ఇంటికి పంపించేందుకు రెడీగా ఉన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన కేసులు మాఫీ కోసం మోడీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలని మోడీ వద్ద తాకట్టు పెట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి. 2019లో చంద్రబాబు నాయుడు గెలుస్తారు అనేది వాస్తవమని అన్నారు. ప్రజలంతా అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలంతా చంద్రబాబు గారిని సపోర్ట్ చేయాలని అయన అన్నారు.
Tags:Jagan around the center of the cases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *