తెలంగాణ లో జగన్ ఫ్యాన్స్

Date:11/06/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆ యువకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. 2009లో తన అభిమాన నేత హఠాన్మరణం తర్వాత ఆయన వారసుడిగా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆకాంక్షించారు. కానీ, మహానేత నిష్క్రమణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు ఆ పదవి దక్కకపోవడంతో నిరాశ

చెందారు. వైఎస్ జగన్ కోసం పలువురు అభిమానులు సంతకాల సేకరణ చేపట్టారు. ఇదే సమయంలో ఆదిలాబాద్‌కు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్‌ మరో అడుగు ముందుకేసి ఓ శపథం పూనారు.

తన అభిమాన నేత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు చెప్పులు ధరించబోనని ప్రకటించాడు. పదేళ్లుగా పాదరక్షలకు దూరంగా ఉన్న అనిల్ కుమార్.. ఏపీకి జగన్ సీఎం కావడంతో తన మొక్కు

తీర్చుకున్నారు.బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శనం చేసుకున్న అనిల్ కుమార్.. ఆలయ సన్నిధిలో దీక్ష విరమించారు. అనంతరం పదేళ్ల తర్వాత తొలిసారిగా చెప్పులు తొడుక్కున్నారు. ఈ

సందర్భంగా అభిమానులు ఆయణ్ని పూల మాల వేసి సన్మానించారు. అనిల్‌ కుమార్‌ 1991లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ స్కూల్‌ ప్రెసిడెంట్‌గా రాజకీయ జీవితాన్ని

ప్రారంభించారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. 2006లో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దివంగతులైనప్పుడు ఆయన

తనయుడు వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని అనిల్ కుమార్ ఆకాంక్షించారు. ఆమరణ దీక్ష చేపట్టారు. ఆదిలాబాద్‌ నుంచి బాసర పుణ్యక్షేత్రం వరకు 160 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా

2009 సెప్టెంబర్‌ 4న జగన్‌ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని ప్రతిన బూనారు. తాజాగా తన కళ నెరవేరడంతో ఆ దీక్ష వీడారు. అనిల్ కుమార్ ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర

ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అనిల్‌ కుమార్‌తో పాటు సీఎం వైఎస్ జగన్‌కు బాసర సరస్వతీ అమ్మవారి ఆశీర్వాదం, తిరుపతి వెంకన్న ఆశీస్సులు నిండుగా ఉండాలని అభిమానులు

ఆకాంక్షించారు.. అభిమానానికి హద్దులు ఉండవని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా ఏపీలో అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే.

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవం, అంతకుముందు మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడి వివాహం, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం తదితర పర్యటనల

సందర్భంగా కేసీఆర్‌పై పలువురు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

జగన్ తర్వాతే బాబు

Tags:Jagan fans in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *