జగన్ పోరాటంతోనే బాబు యూటర్న్ : భూమన కరుణాకరరెడ్డి

Jagan is fighting the battle Ubuntu: Bhimana Karunakara Reddy

Jagan is fighting the battle Ubuntu: Bhimana Karunakara Reddy

Date:13/03/2018
అనంతపురం ముచ్చట్లు:
ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వైకాపా నేత భూమన కరుణాకర రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్న డిమాండ్ తో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి రెడ్డి చేపట్టిన ‘ జలసంకల్ప యాత్ర’ లో అయన పాల్గోన్నారు. వజ్రకరూరు మండలంలోని ధర్మపురిలో జరిగిన బహిరంగ సభలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.  చంద్రబాబు కు చిత్తశుద్ధి లేదు కనుకే వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనంటున్నారు.  టీడీపీ కేంద్ర మంత్రుల రాజీనామా ఓ డ్రామా అని అయన విమర్శించారు. ఏపీకి అన్యాయం జరిగినా ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు మద్దతు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.  ఓవైపు బీజేపీ ప్రభుత్వం లో ఉంటూ వైఎస్సార్ సీపీ పై నిందలు వేయటం భావ్యమా అని నిలదీసారు.  చంద్రబాబు స్వార్థ రాజకీయాల వల్లే ఏపీకి నష్టం జరిగిందని అయన ఆరోపించారు.
Tags: Jagan is fighting the battle Ubuntu: Bhimana Karunakara Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *