Natyam ad

జగన్‌ పులిలాంటి వ్యక్తి – ఒంటరిగానే వేటకు – మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

– రాయలసీమ మాజీ ముఖ్యమంత్రులతో ఓరిగిందేమి
-ఒకరు జగన్‌ను జైల్‌లో పెట్టారు.
-మరోకరు మామకు వెన్నుపోటు
-బాబుకు పవన్‌ దత్తపుత్రుడు
-2024లో 151 సీట్లకు పైగా గెలుస్తాం
-చెప్పులు చూపే సంస్కతి మాది కాదు
– మూడుపెళ్లిళ్లంటు మహిళలను అవమానించడం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పులిలాంటి వ్యక్తి . ఆయన ఒంటరిగానే పోరాటం చేస్తారు. చంద్రబాబు తోకపార్టీలతో పొత్తులు పెట్టుకుంటే మాకు నష్టంలేదు. 2024లో 151 సీట్లకు పైగా గెలుస్తాం. రాయలసీమ ఇద్దరు ముఖ్యమంత్రులుగా పని చేసిన కిరణ్‌, చంద్రబాబులతో ఓరిగిందిలేదు. కిరణ్‌ వైఎస్సార్‌ కుటుంభాన్ని అంతమోదించేందుకు జగన్‌ను జైల్‌లో పెట్టించాడు. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి పదవిలాక్కున్నాడు. బాబుకు పవన్‌ దత్తపుత్రుడుగా ఉంటు బాబు డైరెక్షన్‌లో చెప్పులు చూపడం, మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంటు మహిళలను అవమానించడం నీచ సంస్కతికి నిదర్శనం. ఇలాంటి వారికి తగిన గుణపాఠం తప్పదు అంటు రాష్ట్ర అటవీ, విద్యుత్‌, పర్యావరణ , గ నులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచ ంద్రారెడ్డి , కిరణ్‌, బాబు, పవన్‌లపై ధ్వజమెత్తారు. శుక్రవారం పుంగనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అలాగే వైఎస్సార్‌ చేయూత పథకం క్రింద మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పులిలాంటి వ్యక్తి అని ఆయన వేటకు గుంపులుగా వెళ్లరని, ఒంటరిగానే వెళ్తారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఒంటరిగా జగన్‌ను ఎదిరించే దమ్ములేక స్వార్థంతో పవన్‌తో డ్రామాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు. అందరు కలసి వచ్చినా జగన్‌ను ఏమి చేయలేరని స్పష్టం చేశారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులుగా పని చేసినా కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌ కుటుంభాన్ని అంతమోదించేందుకు కుట్రలు పన్ని జగన్‌ను జైలులో పెట్టించారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు తన మామకు వెన్నుపోటు పోడిచి ముఖ్యమంత్రిగా రాయలసీమ కీర్తి మరోలా గడించేలా చేశారని ఆరోపించారు. పవన్‌కు రాజకీయ అనుభవం లేదని, పార్టీ ఎందుకు స్థాపించారో ఆయనకే తెలియదన్నారు. ఈ విషయం గూర్చి ప్యాకేజిలు తీసుకున్నానని మాట్లాడితే చెప్పుతో కొడతానని వైఎస్సార్‌సీపీ నాయకులను మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రతి మాటలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, 2024లో బాబు, పవన్‌కు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగానే పోటీ చేసి 151 సీట్లకు పైగా స్థానాలు సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామిలను 98 శాతం అమలు చేయడం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటనే సేవలు అందించడం జరుగుతోందన్నారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామిలు ఒక్కటి కూడ అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు విడతల్లో చేయూత నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. ఆసరా, చేయూత, అమ్మ ఒడి, జగనన్నవిద్యాదీవెన , సున్నావడ్డీ రుణాలు, ఈబిసీ నేస్తం పథకం మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు వీలైందన్నారు. మహిళా ఆర్పీలకు రూ.3000 వేలు జీతాలు పెంచడం జరిగిందన్నారు. ఇలాంటి మహాత్తర పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాలని , ఎల్లవేళలా ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, డీసీసీబి చైర్మన్‌ రెడ్డెమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.

 

Tags: Jagan is like a tiger – hunting alone – Minister Peddireddy’s anger

 

Post Midle