రాష్ట్రాభివృద్ధికి జగన్‌ అవసరం

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి అన్నారు. గురువారం వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని బసివినాయునిపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి , వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి తో కలసి డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించారు. గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసి , బుక్‌లెట్లను పంపిణీ చేశారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, సర్పంచ్‌లు మునస్వామి, ప్రభాకర్‌, ఎంపీటీసీ సూరప్ప, నాయకులు నారాయణరెడ్డి, రామకృష్ణ , వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Jagan is needed for the development of the state

Post Midle