– రైతులను ఆదుకునేందుకు చర్యలు
– కుప్పంకు సాగునీరు
– ఎంపీలు రంగయ్య, రెడ్డెప్ప
Date:24/05/2020
పుంగనూరు ముచ్చట్లు:
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం పుంగనూరులో చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి డాక్టర్ శివ నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోను నవరత్నాలుగా రూపొందించి , సంవత్సర కాలంలోనే అమలు చేయడం అభినందనీయమన్నారు. అన్ని వర్గాలను ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా క్యాలెండర్‌ను రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోయారన్నారు. రైతుల కోసం రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందించడం, ఆర్‌బికెల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు గ్రామాల్లోనే పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గ్రామ పరిపాలన ఏర్పాటు చేసి, ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లిన ఘనత వైఎస్.జగన్మోహన్రెడ్డిదేనని కొనియాడారు.
టమోటా, మామిడి రైతులను ఆదుకుంటాం….
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక అభివృద్ధి ప్యాకెజ్ ద్వారా జిల్లాలోని టమోటా, మామిడి రైతులను ఆదుకుంటామని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పేందుకు జిల్లాలో ఎంపీ రంగయ్యతో కలసి పర్యటిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటిలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డి, రంగయ్యలు ఉన్నారని తెలిపారు. అలాగే మంత్రి సూచనల మెరకు కుప్పం నియోజకవర్గానికి సాగునీరు అందించి , కుప్పం నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ తెలిపారు. టీటీడీలో ఆస్తులు వేలం వేస్తున్నారంటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలుపై రెడ్డెప్ప మండి పడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగదన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, జెడ్పిమాజీ ప్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్, జెఏసీ చైర్మన్ వరదారెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన సంఘ నాయకులు రాజేష్, సురేష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు…
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీలు రెడ్డెప్ప, రంగయ్యలు తెలిపారు. ఆదివారం వాల్మీకి సంఘ నాయకులు డాక్టర్ శివ ఆధ్వర్యంలో రెడ్డెప్ప, అద్దాల నాగరాజ, గంగరాజు, త్యాగరాజులు ఎంపీలు ఇద్దరికి శాలువలు కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు తగిన నివేదికలతో ముఖ్యమంత్రి ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. వాల్మీకులకు న్యాయం చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు రాజశేఖర్ , తిమ్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి
Tags: Jagan is the only chief minister to release the calendar of welfare schemes