Natyam ad

సంక్షేమం, అభివృద్ధే జగనన్న లక్ష్యం-ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ప్రజా సంక్షేమం, అభివృద్ధి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  లక్ష్యమని, ఆ దిశగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారని నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బుధవారం పట్టణంలోని 8వ వార్డు పరిధిలో గడప గడపకు తిరిగి ఆయా ఇళ్లలో లబ్ధిదారులు పొందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బుక్ లెట్లు అందించారు.
ఈసందర్భంగా ఎర్రకోట జగనన్న మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి, నేతన్న నేస్తం, ఆసరా, రైతు భరోసా లాంటి పథకాలతో ప్రతి కుటుంబం నేడు బాగుపడ్డాయన్నారు. పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు గాను ఐఏబీ స్కీం కింద రూ. 144 కోట్లతో జీడీపీ నుండి మంచినీటిని పంపింగ్ చేసేందుకు నిర్మాణ పనులను వేగవంతం అయ్యేలా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి రి చర్యలు తీసుకుంటున్నారన్నారు.

 

Post Midle

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్  కె. దివ్వకళ, పట్టణ అధికార ప్రతినిధి కె. సునీల్ కుమార్, దేవారాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, కమీషనర్ ఎన్. గంగిరెడ్డి, డిఈఈ మనోహర్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాద్యాక్షులు రియాజ్ ఆహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, ప్రధాన కార్యదర్శి దొరబాబు, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలెంటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Jagan Mohan Reddy’s goal of welfare and development is Jagan Mohan Reddy

Post Midle