పేదల సంక్షేమదాత జగన్ -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాలను ప్రవేశపెట్టి , వారిని అన్ని విధాల ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. గురువారం సాయంత్రం మండలంలోని మంగళం గ్రామంలో పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బోయకొండ చైర్మన్ నాగరాజారెడ్డితో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీని జెండాను ఎగురవేశారు. జగనన్ననే మా నమ్మకం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై అభిప్రాయాలు సేకరించారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి నియోజకవర్గంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతి ఇంటికి నవరత్నాలను అందించి, ఆదర్శమైన మండలంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని సేవలు ప్రజల ముంగిటకే అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మండల సచివాలయల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రామమోహన్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:Jagan – MPP Bhaskar Reddy is the welfare giver of the poor