జగన్, పవన్ తో కేంద్రం కుట్ర : సీఎం చంద్రబాబు

Jagan, Pawan's conspiracy with the Center: CM Chandrababu

Jagan, Pawan's conspiracy with the Center: CM Chandrababu

Date:16/03/2018
అమరావతి ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం జగన్, పవన్ లతో డ్రామాలు ఆడుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం అయన తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేంద్రం వైఖరిపై ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా మహా కుట్ర జరుగుతోందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను వదిలిపెట్టబోమని, ప్రజా కోర్టులో నిలబెడదామని చెప్పారు. కేంద్రం, జగన్, పవన్ ల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తగిన సమయంలో వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ మహా కుట్రలో భాగస్వాములు అందరికి ప్రజలు తగిన బుద్ది చెబుతారు. 14వ ఆర్ధిక సంఘం హోదా  ఇవ్వవద్దని చెప్పలేదని నిన్నే కేంద్రమంత్రి ఇంద్రజిత్ ప్రకటించారు. హోదా ఇవ్వవద్దని ఆర్ధిక సంఘం చెప్పినట్లుగా మనకు చెప్పారు.ఎందుకీ నాటకం..?దేనికీ నాటకాలని అయన కేంద్రాన్ని నిలదీసారు. రాష్ట్రంలో ప్రజాదోంళనలు తీవ్రంగా జరుగుతున్నా కేంద్రం ఉదాసీనంగా ఉంటోంది. ఆర్ధిక బిల్లు కూడా ఆమోదించుకుని వాయిదా వేసుకుపోతున్నారని అయన వ్యాఖ్యానించారు.వైకాపా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం కాకుండా సొంతంగా తెలుగుదేశమే లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా మీ ద్వారానే వచ్చేలా చూస్తాం…అవిశ్వాసం పెట్టు, ఎంపీలతో రాజీనామాలు చేయించు అని జగన్, ఆమరణ దీక్ష చేయి…నీ ద్వారా ప్రత్యేక హోదా ఇస్తామని పవన్ కల్యాణ్ తో కేంద్రం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. జగన్, పవన్ లతో డ్రామాలాడిస్తున్న కేంద్రం వైఖరిని ప్రజలలో ఎండగడదామని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం పవిత్ర కార్యాలయం అని పేర్కొన్న చంద్రబాబు అక్కడ ఆర్ధిక నేరాల కేసులలో ఏ1, ఏ 2 లకు ఏం పని అని చంద్రబాబు ప్రశ్నించారు. గాలి జనార్దన రెడ్డిలాంటి వాళ్లను వదిలిపెడుతున్నారు, విజయసాయి రెడ్డిలాంటి వాళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు. మీడియాను చూసి విజయసాయి రెడ్డి పీఎంవోలో దాక్కోవడం ఎందుకు..? వెనకనుంచి పరారు కావడం ఎందుకు..? విజయసాయి రెడ్డితో కలిసి పీఎంవోకు వచ్చిందెవరని అయన అడిగారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలు మీకు పట్టవా..? 4 ఏళ్లలో ఒక్కమాట నన్ను అనని పవన్ ఇప్పడీ విమర్శలు చేయడం వెనుక కుట్ర ఏమిటి..? ఈ కుట్ర వెనుక ఉన్నదెవరని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రంపై టిడిపి పోరాడుతుంటే ఇప్పుడే పవన్ విమర్శలు ఎవరికి  లాభం చేసేందుకని అయన నిలదీసారు.
Tags: Jagan, Pawan’s conspiracy with the Center: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *