Natyam ad

జగన్ ను మరోసారి గెలిపించుకోవాలి

మదనపల్లె ముచ్చట్లు:

 


సంక్షేమ పాలన కోసం మరొక సారి వైసిపిని గెలిపించి, జగన్మోహన్ రెడ్డిని మరొక సారి గెలిపించు కోవాలని ఎమ్మెల్యే నవాజ్ భాష విజ్ఞప్తి చేశారు.అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 15వ
వార్డుకు సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ మునిసిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, కౌన్సిలర్లు రాజేష్, శంకరమ్మ, భాను ప్రకాష్, శ్రీనివాసులు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో జగనన్నసురక్ష పథకం కింద ప్రజలకు వివిధ రకాల మున్సిపల్, పంచాయతీ సేవలను ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద సర్వే నిర్వహించి అనారోగ్యంతోబాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 

Tags:Jagan should win once again

Post Midle
Post Midle