తిరుమలకు చేరుకున్న జగన్‌

Jagan to reach Thirumala

Jagan to reach Thirumala

– ఘనస్వాగతం పలికిన పెద్దిరెడ్డి

 

Date:28/05/2019

తిరుమల ముచ్చట్లు:

వైఎస్సార్సీపి అధినేత , కాబోయే నూతన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆయన కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యేలు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణారెడ్డి , చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపి రెడ్డెప్ప, ఈవో సింగాల్‌ , డీఐజి క్రాంతిరాణాటాటాలు, మాజీ జెడ్పి చైర్మన్‌ రెడ్డెమ్మ ఘన స్వాగతం పలికారు. ఎంతో ఆప్యాయంగా జగన్‌మోహన్‌రెడ్డి పలువురిని పలుకరిస్తూ వెళ్లారు. జగన్‌ మోహన్‌రెడ్డి రాత్రికి తిరుమలలో బస చేసి, ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆయన పులివెందులకు వెళ్తారు.

 

పుంగనూరులో మూడురోజులకొక్కసారి నీటి సరఫరా

Tags: Jagan to reach Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *