108వ రోజుకు చేరిన జగన్ యాత్ర

Jagan tour to reach 108th day

Jagan tour to reach 108th day

Date:15/02/2018
నెల్లూరు ముచ్చట్లు:
యాత్ర‌లు సంగ‌తి ఎలా వున్నా వైసీపీలో కొత్త చిక్కు వ‌చ్చి పడింద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌దే గెలుపు.. నేనే సీఎం అంటూ.. రోజూ 108 సార్లు మంత్రిస్తున్నా.. ప్ర‌త్య‌ర్థులు ప‌ట్టించుకోవ‌ట్లేదు.  పైగా  సొంత వాళ్లు కూడా లైట్ తీస్కో అన్న‌ట్లుగా ఉన్నార‌ట‌. 2009లోనే కాస్త ఓర్పుగా ఉంటే.. ఈ బాధ ఉండేది కాదుగా అంటూ.. ముఖాన అన్లేక‌.. త‌మ‌లో తామే చ‌ర్చించుకుంటున్నార‌ట‌. పోన్లే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ప‌క్క‌నే ఉన్నా.. ఈ కొద్ది రోజులు కూడా ల‌క్ చూద్దాం! అన్న‌ట్లుగా ఉన్న నేత‌లు ఎక్కువ‌ట‌. అమ్మ‌.. అన్నం పెట్ట‌లేనోడు.. పిన్న‌మ్మ‌కు ప‌ట్టుచీర పెడ‌తానంటే ఇదే అనుకుంటూ ఎద్దేవా చేస్తున్నార‌ట‌. అందాకా.. ఎందుకండీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఎమ్మెల్యేలు ఎంత‌మంది ఫ్యాన్ రెక్క‌లు ప‌ట్టుకుని ఉంటార‌నే భావ‌న కూడా పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. మొన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్త‌ఫా, నిన్న‌.. నెల్లూరులో మ‌రో ఎమ్మెల్యే.. ఇప్పుడు.. సీమ‌లో మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అదేనండీ.. వైసీపీ ఎమ్మెల్యేలు.. లోక‌ల్ మంత్రుల‌తో ట‌చ్‌లో ఉంటున్నార‌ట‌. ఎప్పుడు రెడీ అంటే.. అప్పుటిక‌ప్పుడే.. ప‌సుపు కండువా క‌ప్పుకుని సైకిల్ ఎక్కేస్తామంటూ హామీ కూడా ఇచ్చార‌ట‌. ఓ వైపు జ‌గ‌న్ సీఎం సంక‌ల్పంతో యాత్ర‌ల‌కు పూనుకుంటే.. మ‌రోవైపు సొంత‌గూట్లో ఇలా వెన్నుపోటు పొడిచే వారు కూడా ఉన్నార‌ని తెలిసి.. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం సేక‌రించేందుకు జిల్లాల‌న్నిట్లిలో వేగుల‌ను ఉంచార‌ట‌. సొంత‌మీడియా సాక్షి వున్నా.. నేత‌ల‌కు నొప్పిలేకుండా.. స‌మాచారం ఇస్తున్న‌ట్లు జ‌గ‌న్ గుర్తించార‌ట‌. పైగా.. మ‌నం అక్క‌డ బ‌ల‌హీనంగా ఉన్నామ‌ని నివేదిక‌లిస్తే.. ఉద్యోగాలు ఎక్క‌డ ఊడిపోతాయ‌నే భ‌యం కూడా.. పాపం.. చాంబ‌ర్‌లో కూర్చుని లెక్క‌లు క‌డుతున్న సీనియ‌ర్ల‌లో పేరుకుపోయింద‌ట‌. అందుకే.. త‌మ స్వామి భ‌క్తిని చాటుకునేందుకు సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ ఆహా.. వైసీపీ ఓహో అంటూ కామెంట్స్ పెడుతూ.. తెగ పోస్టులు పెడుతున్నారు. ఇంత చేసినా.. ఈ భ‌క్త‌గ‌ణ‌మే.. అర్రే.. మ‌న ఫ్యాన్ రెక్క‌ల‌న్నీ ఉంటాయా! ఊడ‌తాయా! అంటూ.. చ‌ర్చించుకుంటున్నార‌ట‌.
Tags: Jagan tour to reach 108th day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *