Natyam ad

పోలవరం ప్రాజెక్టును నేడు పరిశీలించిన జగన్- అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు

పోల’వరం’ తొలిదశకు రూ.12,911 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం

రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది..ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదు: సీఎం జ‌గ‌న్‌

ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉంది

 

Post Midle

పోలవరం ముచ్చట్లు:

సీఎం జగన్‌ ఏలూరు జిల్లా పోలవరంలో ప‌ర్య‌టించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం సమగ్రంగా పరిశీలించారు.పోల‌వ‌రం ప్రాజెక్టు కీలక పనుల్లో గణనీయ ప్రగతి క‌నిపిస్తోంద‌ని అధికారులు సీఎ జ‌గ‌న్‌కి వివ‌రించారు. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులు.. అన్నింటినీ సమగ్రంగా పరిశీలించారు. గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచారు. దీన్నికూడా ముఖ్య‌మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాంను పరిశీలించారు. గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇసుకను నింపే పనులను పరిశీలించారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులను సీఎం పరిశీలించారు. డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో పునర్‌ నిర్మాణాలు, ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణలపై అధికారులతో చర్చించారు. తర్వాత ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో పోలవరం ప్రాజెక్టులో కీలక పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు.

 

 

 

ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. అనంతరంవారికి కీలక సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసేలా శ్రమించాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని పూర్తిస్ధాయిలో రాబట్టుకోవడంతో పాటు వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు.

 

 

 

డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ కోరారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్‌ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష చేశారు. పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

 

 

 

నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు సీఎంకు తెలిపారు. షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్నారు. పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్‌ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

 

పోల’వరం’ తొలిదశకు రూ.12,911 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం

సీఎం జగన్ శ్రమ, కృషి ఫలిం­చింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడు­దలపై కేంద్రంను ఒప్పించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా కేంద్రం అంగీకరించింది. అలాగే, ప్రాజెక్టుకు 2013–14 ధరలతో కాకుండా తాజా ధరల ఆధారంగా నిధులు చెల్లించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్‌ ఎల్‌కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా­రామన్‌ ఆమోదించినట్టు లేఖలో స్పష్టీకరించారు.

 

 

2013–14 ధరల ప్రకా­రం పోలవరానికి నిధులిచ్చేందుకు గతంలో కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన నేపథ్యంలో ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని కోరింది. కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకుని నిధులు విడుదల చేస్తామని లేఖలో పేర్కొన్నారు.

 

 

 

ఇప్పటికే అనేక సార్లు జగన్ పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం ఢిల్లీ వెళ్లారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసి తొలిదశలో ముందస్తుగా ఫలాలను రైతులకు అందించేందుకు వీలుగా రూ.10,000 కోట్లను అడ్‌హాక్‌గా (ముందస్తుగా) ఇవ్వాలని ప్రధాని మోదీని గత ఏడాది జనవరి 3న ఢిల్లీలో సీఎం జగన్‌ ప్రతిపాదించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని కానీ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సాధ్యపడదని ప్రధాని మోదీకి సీఎం వివరించారు.

Tags:Jagan, who inspected the Polavaram project today, gave key instructions in the review with the officials

Post Midle