జగన్‌కు రాష్ట్ర ప్రజలు గతంలోకంటే అధిక స్థానాలు అందిస్తారు- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-పుంగనూరుపై జగన్‌కు అపారమైన ప్రేమ
-కిరణ్‌ గీతలు గీసి అభివృద్ధి
– జగన్‌ అభివృద్ధికి హద్దులు లేదు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రజలు గతంలో కంటే అధిక స్థానాలు రాబోవు ఎన్నికల్లో అందించడం ఖాయమని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పుంగనూరు మండలంలో ఆర్‌బికెలు, సచివాలయాలు, వైఎస్సార్‌ హెల్త్ క్లీనిక్‌లు, సబ్‌స్టేషన్లను మంత్రి ప్రారంభించారు. ఎంసి.పల్లెలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్లులా నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో మాజీ సీఎం కిరణ్‌ మూడన్నరేళ్లు పని చేసి తన నియోజకవర్గాన్ని కూడ అభివృద్ధి చేయకుండ గీతలు గీసి అభివృద్ధి పనులు ఆర్ధాంతరంగా ఆపివేశారని, రోడ్లను డబుల్‌ రోడ్లుగా మార్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. జిల్లాకు, ర్ఖా•నికి కిరణ్‌ చేసింది శూన్యమని ఎద్దెవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అండగా నిలిచి, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. జగన్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు హద్దులు లేవన్నారు. అవసరమైన ప్రాంతాలలో ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనన్నారు. పుంగనూరు వెనుకబడిన ప్రాంతం కావడంతో మనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ,నిధులు కేటాయించడంతో ఈ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, కాలువలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించి, ఇంటింటికి కొళాయిల ద్వారా నీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ఎన్నికలలోపు ప్రారంభించి, ప్రజలకు అంకితం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్‌కు అత్యధిక స్థానాలు ఇచ్చి తిరిగి ముఖ్యమంత్రిని చేస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఎస్సీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags: Jagan will be given more positions by the people of the state than before – Minister Peddireddy Ramachandra Reddy

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *