జగన్ సీఎం అవుతారు

Jagan will become CM

Jagan will become CM

Date:22/05/2019

తిరుమల ముచ్చట్లు:

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నారే తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు.తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలిచి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే దొంగ సర్వేనని, ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. లగడపాటి సర్వేను ప్రజలు నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.

 

శ్రీ మఠంలో బాలనాగిరెడ్డి 

Tags: Jagan will become CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *