జగనన్నే మా ప్రాణం…
పుంగనూరు ముచ్చట్లు:
జగనన్నే మాప్రాణం అంటు ప్రజలు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తూ మద్దత్తు ఇస్తున్నారని పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎంసీపల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డితో కలసి జగనన్నే మా భవిష్యత్తు….మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలుసుకున్నారు. నాలుగు ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. లభ్ధిదారుల అనుమతితో ఇంటికి, సెల్‌ఫోన్లకు స్టిక్కర్లు వేసి , ముఖ్యమంత్రి సెల్‌నెంబరుకు మిస్‌డ్‌కాల్ ఇచ్చారు. వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించిన ఘన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, సురేంద్రరెడ్డి, రమణ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటిలో…
మా నమ్మకం నువ్వే జగన్ …జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ఐదవ రోజు అపూర్వ స్పందన లభించింది. మున్సిపాలిటిలో చైర్మన్ అలీమ్‌బాషా, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ఫ్బోర్డు చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో 31 వార్డులలో కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు, గృహసారధులు ఇంటింటికి వెళ్లారు. కరపత్రాలు పంపిణీ చేసి, నాలుగు ప్రశ్నలకు సమాదానాలు సేకరించారు. ప్రజల అనుమతితో స్టిక్కర్లు వేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎంతో అప్యాయంగా పలకరించి అన్ని పథకాలు అందుతున్నాయ్…జగన్ చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలంటు తెలిపారు.
Tags; Jaganan is our life…
