Natyam ad

అందరికీ సంపూర్ణ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ధ్యేయం : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు ముచ్చట్లు:


పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోనే ప్రజల అందరికీ సంపూర్ణ వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని వైకాపా నేత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ని అన్నారు. శనివారం పట్టణంలోని శిల్పా కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో  జగనన్న  ఆరోగ్య సురక్ష పథకాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందివ్వడంతో పాటు, ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం నిధి కింద అనారోగ్యానికి గురైన వారికి ఆర్థిక సాయం అందించడం కూడా జరిగిందన్నారు. అలాగే గ్రామాలలో విద్య వైద్యంతో పాటు  ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందన్నారు. అందువల్ల రానున్న ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ను ఎన్నుకునేందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమీషనర్, పట్టణ అధ్యక్షుడు, టౌన్ బ్యాంక్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Jagananna Arogya Suraksha’s mission is to provide complete medical care to all: Errakota Jaganmohan Reddy

Post Midle
Post Midle