Natyam ad

పుంగనూరులో జగనన్న శాశ్వత భూసర్వేతో సమస్యలకు చెక్‌

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణప్రాంతాలలో భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత భూ రక్షణతో సమస్యలు పరిష్కారమౌతుందని తహశీల్ధార్‌ వెంకట్రాయులు తెలిపారు. బుధవారం మండలంలోని మంగళం సచివాలయంలో జగనన్న భూ హక్కు సర్వేపై ప్రజలకు అవగాహన సద స్సును ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి నిర్వహించారు. తహశీల్ధార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో భూ సర్వే కార్యక్రమం డ్రోన్‌ల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. సర్వే కార్యక్రమం ఒక రోజు ముందుగా రైతులకు నోటీసు రూపంలో తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, సరిహద్దులు గుర్తించడం జరుగుతుందన్నారు. వాటిని ఓవర్‌హెడ్‌ సీట్‌లో ప్రకటించడం జరుగుతుందన్నారు. పట్టాభూములు వివరాలు సేకరించి గుర్తించి రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారెడ్డి, రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Jagananna checks problems with permanent land survey in Punganur

Post Midle