జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవన
-ముగ్గురు విద్యార్థులకు మొదటి వాయిదా రూ. 24,63,041 జమ
తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించే దిశలో జగనన్న విదేశీ విద్యా దీవెన అమలులో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది అర్హులైన విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లు కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి నేటి శుక్రవారం ఉదయం సంబంధిత మంత్రులతో కార్యదర్శులతో కలిసి వర్చువల్ విధానంలో గౌరవ ముఖ్యమంత్రి నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయగా, తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి సంబంధిత అధికారులతో, లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసిందని, ఈ ఏడాదికి గాను టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లోని వాటిలో అడ్మిషన్లు పొందిన జిల్లాలోని ముగ్గురు విద్యార్థులు ఎంపిక కాగా అందులో ఎస్సీ కేటగిరీలో ఒకరు, బి.సి కేటగిరీలో ఇద్దరు ఎంపిక అయ్యారని, విద్యార్థుల ఖాతాల్లో నేడు ముఖ్యమంత్రి బటన్ నొక్కి రూ. 24,63,041 లక్షలు జమ చేయగా జిల్లాలోని ముగ్గురు విద్యార్థులకు మొదటి వాయిదా లో భాగంగా 25శాతం మొత్తాన్ని ఎస్సీ లబ్ధిదారులు కొమ్మపూడి జీవన్ ప్రకాష్ A- ఫరాబి కజఖ్ నేషనల్ యూనివర్సిటీ అల్మాటీ, ఖజకిస్తాన్ QS ర్యాంక్ 150 ఎంబిబిఎస్ కొరకు రూ. 6,00,400, బిసి కేటగిరీ కింద
రాసక్కగారి ఝాన్సీ రాణి న్యూయార్క్ యూనివర్సిటీ నందు ఎమ్మెస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజినీరింగ్ మరియు ప్లానింగ్ కోర్సు కొరకు రూ. 13,12,641, నాగవరం బాబు రంజిత్ వెస్టర్న్ యూనివర్సిటీ నందు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్సెస్ కోర్సు కొరకు రూ. 5,50,000 నగదు వారి ఖాతాల్లో జమ అయిందని తెలిపారు.
టాప్ 100 QS ప్రపంచ ర్యాంక్ విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందిన
SC/ ST/ BC/ మైనారిటీ మరియు EBC విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మెరిట్‌ను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వం ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ మైనారిటీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ. ఒక కోటి వరకు ఎంతైతే అంత వంద శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోందని, టాప్ 100 నుండి 200 QS ర్యాంకులతో విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందిన SC/ ST/ BC/ మైనారిటీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 75 లక్షల వరకు వంద శాతం ట్యూషన్ ఫీజ్ రీయింబర్స్మెంట్, ఇతరులకు గరిష్ఠంగా రూ. 50 లక్షలు లేదా 50 శాతం ట్యూషన్ ఫీజు వీటిలో ఏది తక్కువైతే అది చెల్లింపు ద్వారా ఈ పథకం కింద విదేశాలకు వెళ్లే విద్యార్థుల విమాన ఛార్జీలు మరియు వీసా ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందని అన్నారు.
Tags: Jagananna Foreign Education Day in the district
