Natyam ad

జగనన్న ఇచ్చిన మాట నేరవేర్చారు

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేశారని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎస్వీటి సోము తెలిపారు. ఆదివారం పట్టణంలోని రాగానిపల్లె రోడ్డు, బిలాల్‌ మసీదువీధి ప్రాంతాలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే కోనేటిపాళ్యెం, హైస్కూల్‌వీధి ప్రాంతాలలో పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్‌ శివ, డాక్టర్‌ శరణ్‌, సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి, త్రిమూర్తిరెడ్డి, ఆవుల హరిప్రసాద్‌, మధుసూదన్‌రెడ్డి, పి.ఎల్‌.శ్రీధర్‌, కృష్ణప్ప, శ్రీనివాసులు, నానబాలగణేష్‌, రెడ్డెప్ప, ఆర్‌కె.రామకృష్ణ, డాక్టర్‌ రమణరావు, బిటి.అతావుల్లా ,రామచంద్ర లు కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము , కౌన్సిలర్‌ సాజిదాబేగంలు యూబికాంపౌండు, రహమత్‌నగర్‌లలో ప్రచారాలు నిర్వహించారు. పార్టీ కరపత్రాలు పంపిణీ చేశారు. మే 13న జరగబోవు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ మెజార్టీతో గెలిపించాలని , రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ కోరారు. ఈ కార్యక్రమాలలో ముల్లంగి విజయకుమార్‌, భాస్కర్‌జెట్టి, తుంగ చంద్రశేఖర్‌, మునిరాజ, ఉమాదేవి, సిద్దారెడ్డి , బాషు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Jagananna fulfilled his promise

Post Midle