Natyam ad

పద్నాలుగు రోజులపాటు జగనన్న మా భవిష్యత్తు

కాకినాడ ముచ్చట్లు:


ఈనెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు జగనన్న మా భవిష్యత్తు పేరిట 14 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. మని కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు, కాకినాడరూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమ వివరాలను తెలియజేసేందుకు మీడియా సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ 14వ తేదీ వరకు గత ప్రభుత్వం- మా ప్రభుత్వం పరిపాలన తీరును ప్రజలకు వివరిస్తూ క్షేత్రస్థాయిలో జగనన్న సైన్యంతో ఇంటింటా పర్యటించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏడు లక్షల గృహ సారదులుతో 21 రోజులు కార్యక్రమంలో కోటి మందిని కలవనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

 

Tags; Jagananna is our future for fourteen days

Post Midle
Post Midle