Natyam ad

జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను పరిశీలించిన జిల్లా పత్యేక అధికారి

మదనపల్లె ముచ్చట్లు:

 


రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పడుతోందని, ఆరోగ్యశ్రీని ఎంతో బలవపేతం చేసిందని అన్నమయ్య జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు తెలిపారు. నేడు మదనపల్లె అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ గిరీష, మదనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మనుజా, ఆర్డిఓ మురళి, డిఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి, మదనపల్లి స్పెషల్ ఆఫీసర్ ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తాసిల్దారు మహబూబ్ చాంద్, ఎంపీడీవో విజయభాస్కర్, సిడిపిఓ సుజాత, డాక్టర్లు, ఆరోగ్య మిత్రలు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

 

 

 

ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కింద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ, రెఫరల్ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలు జరిగిన అనంతరం ఆరోగ్యమిత్ర, ఏఎన్ఎం, ఆశ, పిహెచ్సి డాక్టరు అందరూ సమన్వయంతో సదరు పేషెంట్ కు ఫాలోఅప్ ట్రీట్మెంటును తప్పని సరిగా అందజేయాలన్నారు. ఫాలో అప్ చికిత్సకు కూడా ఆరోగ్యశ్రీలో ప్యాకేజెస్ ఉన్నాయని, ఇందుకు తగిన మార్గదర్శకాలు ఉన్నాయని, ఈ విషయాలపై ఆరోగ్యమిత్ర, ఏఎన్ఎంలు, వాలంటీర్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తోందని, వీటిని మొక్కుబడి క్యాంపు లాగా భావించరాదని చెప్పారు.

 

Post Midle

Tags: Jagananna is the District Special Officer who inspected the Health Protection Camps

Post Midle