Natyam ad

ప్రజల పట్ల ప్రభుత్వానికున్న కమిట్మెంట్ ను మరో సారి చాటుకున్న జగనన్న..

భర్తను కోల్పోయిన మహిళకు రాష్ట్ర సచివాలయ వ్యవస్థలోనే తొలి కారుణ్య నియామకం కింద ఉద్యోగం…

ముఖ్యమంత్రి కి థాంక్స్ చెప్పిన వసంత భాయ్

తనకు సహాయం చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటన…

Post Midle

రామకుప్పం నివాసి అయిన తనకు తిరుపతిలో ఉద్యోగం వస్తుందని ఊహించలేదంటూ ఉక్కిరి బిక్కిరి…

నగర మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలికి ప్రత్యేక కృతజ్ఞతలు

తిరుపతి ముచ్చట్లు:

ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర సచివాలయ వ్యవస్థలోనే మొట్ట మొదటి సారిగా కారుణ్య నియామకం కింద రామకుప్పం మహిళకు ఉద్యోగ అవకాశం దక్కించుకున్న వసంత భాయ్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గం, రామకుప్పం ప్రాంతానికి చెందిన మోహన్ నాయక్….భూమన కరుణాకర రెడ్డి సొంత నియోజక వర్గమైన తిరుపతి, జీవకోన ప్రాంత సచివాలయంలో ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య సమస్యలతో మోహన్ నాయక్ ఇటీవల మృతి చెందారు. దీంతో మోహన్ నాయక్ భార్య వసంత భాయ్ కుంగిపొయారు. ఊరుకాని ఊరులో తన భర్త ను పోగొట్టుకున్న బాధతో కన్నీరు మున్నీరయ్యేలా విలపించారు. కుటుంబ పోషణ భారంగా మారింది. తన బాధ ను ఎవరికి చెప్పుకొవాలో దిక్కు తోచనిస్థితి ఆమెది. ఇలా ఇబ్బంది పడుతున్న తరుణంలో నే తాను నివాసం ఉంటున్నజీవకోన వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని కలిసి తన కష్టాన్ని చెప్పుకోవాలని నిర్ణయానికి వచ్చారు. తమ ఇంటి వద్దకే విచ్చేసిన భూమన కరుణాకర రెడ్డి కి తన కష్టాన్ని వివరించారు. తనకు సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు చలించి పోయిన భూమన కరుణాకర రెడ్డి వెంటనే స్పందించి అనంతపురం రీజియన్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టెర్ తో ఫొన్లో మాట్లాడి, వసంతా భాయ్ కి ఉద్యోగం వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫైళ్లను సిద్దం చేయాల్సిందిగా నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలికి ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడంతో వసంతా భాయ్ కి జీవకోన సచివాలయంలో అడ్మిన్ ఉద్యోగం దక్కింది. అనతి కాలం లోనే ఉద్యోగం రావడంతో వసంత భాయ్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

 

 

 

తిరుపతిలో గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనకు స్వాంతన చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్ని విధాలా సహాయం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి రుణపడి ఉంటామన్నరు. తన భర్త చనిపోవడం తో ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ని కలిసి వివరించానని మీడియా ప్రతినిధులకు చెప్పారు. తాను అడిగిన వెంటనే ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్పందిచి, అనంతపురం రీజియన్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ తో మట్లాడి, తనకు ఉద్యోగం ఇప్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిని చాలా వేగంగా స్పందించారని, చక,చకా ఫైళ్లను సిద్దం చేశారన్నారు. రామకుప్పం నివాసి అయిన తనకు తిరుపతిలో ఉద్యోగం వస్తుందని ఊహించలేదన్నారు. తనకు అంకిత భావంతో సహాయం చేసినందుకు థాంక్యూ సీఎం సార్ అన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటాననని తెలిపారు. అదేవిధంగా నగర మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలికి వసంత భాయ్ కృతజ్ఞతలు చెప్పారు. ముత్యాల రెడ్డి పల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న భూమన కరుణాకర రెడ్డి ని, నగర మేయర్ శిరీష ను దుశ్శాలువలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: Jagananna once again showed the government’s commitment to the people.

Post Midle

Leave A Reply

Your email address will not be published.