జగనన్న సురక్ష – పేదలకు వరం లాంటిది
కౌతాళం ముచ్చట్లు:
కౌతాళం మండలం లోని సులకేరి గ్రామ సచివాలయ పరిథిలో ( ఎంపిడివో టీం-1 ) ” జగనన్న ఆరోగ్య సురక్ష ” క్రింద క్యాంపు డే ( 13 వ రోజు) కార్యక్రమం లో పాల్గొన్న ఎంపిడివో సుబ్బ రాజు, బంట
కుంట గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పంచాయతి సెక్రటరీ వెంకటేశు, వైకాపా నాయకులు ఆదినారాయణ రెడ్డి , డాక్టర్స్ షాన వాజ్, గియాజ్ బేగం, మమత, వారి వైద్య
సిబ్బంది, సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ఫాల్గొనడం జరిగినది. ఐసిడిఎస్ డిపార్ట్ మెంట్ సూపర్ వైజర్ అఖిల ఆధ్వర్యంలో న్యూట్రిషన్ స్టాల్స్ లను యేర్పాటు చేయడం జరిగినది.
ఈ సంధర్భంగా అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ” జగనన్న కంటి వెలుగు ” కార్యక్రమం క్రింద 1 లబ్ధిదారునికి కంటి అద్దాలు మరియు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ క్రింద 5.00 లక్షల ఆయుష్మాన్ భారత్
కార్డులను అందజేయడం జరిగింది.
Tags: Jagananna suraksha – is like a boon to the poor

