Natyam ad

పుంగనూరులో జగనన్న సురక్ష వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని శనివారం మంగళం గ్రామంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. డాక్టర్‌ సల్మా ఆధ్వర్యంలో జరిగిన వైద్యులు సృజన, తేజశ్వని, కిరణ్మయి , సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. వెహోత్తం 160 మందికి పరీక్షలు నిర్వహించారు.- బోయకొండ చైర్మన్‌ నాగరాజారెడ్డి తో కలసి ఎంపీపీ జగనన్న సురక్ష కిట్లను ప్రజలకు పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలతో పేద ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన మందులు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. దీర్ఘకాలిక వ్యాదులు ఉన్న వారిని గుర్తించి ఆరోగ్యశ్రీ పథకం క్రింద వారికి చికిత్సలు చేసే కార్యక్రమం ప్రతిపాదనకు పంపామన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారెడ్డి, రామమోహన్‌రెడ్డి, జయరామిరెడ్డి, సచివాలయ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Jagananna Suraksha Medical Camp at Punganur

Post Midle