జిల్లాలో జగనన్న విద్యాకానుక  

1,85,361 మందికి రూ 30.93 కోట్ల విలువైన స్టూడెంట్ కిట్ల పంపిణీ
జిల్లా కలెక్టర్

తిరుపతి ముచ్చట్లు:

జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జగనన్న విద్యాకానుక ద్వారా  1 నుండి 10 వ తరగతి విద్యార్థులు 1,85,361 మందికి సుమారు రూ 30.93 కోట్ల విలువైన స్టూడెంట్ కిట్లు సరఫరా నేటి నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పాఠశాలల ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక  పద్మావతి పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఈ రోజు శుభదినం అని తెలుపుతూ న భూతో న భవిష్యతి అనే చందంగా ప్రభుత్వ పాఠశాలలలో నేడు విద్యా విధానం అద్భుతంగా తయారైందనీ, మన బడి – నాడు – నేడు కింద ఎన్నో పాఠశాలలను అభివృద్ధి చేసి వాటిలో టేబుల్స్, బ్లాక్ బోర్డులు ఏర్పాటు తదితర వసతుల కల్పన చేసి, టాయ్లెట్ ల ఏర్పాటు చేసి వాటి నిర్వహణ అధ్బుతంగా జరుగుతున్నదని అన్నారు. అవసరమైన అదనపు గదుల నిర్మాణం, మరమ్మత్తులు ఇలా  అన్ని పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి మేరకు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తల్లులు వారి పిల్లలను పనికి కాకుండా బడికి పంపే విధంగా ఉన్ముక్త్యుల్ని చేసి బడి ఈడు పిల్లలందరిని పాఠశాలల్లో చేర్చే విధంగా తల్లుల ఖాతాల్లోకి పారదర్శకంగా అమ్మఒడి ద్వారా రూ 15000 వంతున  జమ చేస్తున్నారని,  ఇలా పలు రకాలైన పథకాలు విద్యార్థులకు అందే విధంగా గౌ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారనీ కొనియాడారు. పేరెంట్స్ కమిటీ లు సమర్థవంతంగా పని చేసి పాఠశాలల నిర్వహణ, వాటి పని తీరుపై సమయానుసారంగా సూచనలు చేసి మరింతగా మెరుగు పరుచుకునే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై పెడుతున్న ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అని తెలుపుతూ తల్లులందరు వారి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి  విద్య అందించడం ద్వారా ఒక మంచి సమాజం ఏర్పాటు అవుతుందని సూచించారు. బైజ్యూస్ తో ప్రభుత్వ ఒప్పందం ద్వారా పాఠశాలల్లోని విద్యార్థులకు మరింత పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని,  మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు మీద ఎంతో ముందు చూపుతో ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  ఆదోని నుండి ప్రారంభించారని తెలుపుతూ  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 47,40,421 మంది విద్యార్థినీ విద్యార్థులకు వరుసగా మూడోసారి రూ 931.02 కోట్లు ఖర్చుతో  శ్రీకారం చుట్టారని , 2020-21 విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు అక్షరాల రూ 2368.33 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఒక్కో విద్యార్థికి దాదాపు రూ. 2000 విలువ చేసే స్టూడెంట్ కిట్లని నేడు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.జగనన్న విద్యా కానుక  2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గురుకులాలు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్, కె జి బి వి, పాఠశాలల్లో, రిజిస్టర్డ్ మదర్శాలలో 1 నుండి 10 వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి సమగ్ర శిక్షా ఆద్వర్యంలో జగనన్న విద్యా కానుక పేరుతో  స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని తెలిపారు. ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన తదితర కార్యక్రమాలు విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కొరకు ఉన్నతమైన ఆశయంతో అమలు చేస్తున్నారని అన్నారు. జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్ లో ప్రతి విద్యార్థికి ఉచితంగా మూడు జతల యూనిఫాం క్లాత్ కుట్టు కోలీతో సహా, నోట్ పుస్తకాలు, బైలింగువల్ పాఠ్య  పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్, ఆక్స్ ఫర్డ్ తెలుగు – ఇంగ్లీష్ డిక్షనరీ తో కలిపి పాఠశాల ప్రారంభo నుండి విద్యార్థులకు అందజేయబడుతున్నయని తెలిపారు.పద్మావతి పురం సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అందరు తల్లులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా పాఠశాలలను అద్భుతంగా తీర్చి దిద్దినది జగనన్న ప్రభుత్వం అని అభినందించారు.జిల్లా విద్యాధికారి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా పరమైన అంశాలపై నేటి వరకు సుమారు రూ 52,676.98 కోట్లు ఖర్చు చేసిందని ఇది ఎంతో శుభ పరిణామము అని తెలిపారు.

 

Tags: Jagananna Vidyakanuka in the district

Leave A Reply

Your email address will not be published.