Natyam ad

చెప్పింది చేయడమే జగనన్న లక్ష్యం- జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేశారని , చెప్పింది చేయడమే జగనన్న లక్ష్యమని…. మాయమాటలతో మోసగించడం ఆయనకు అలవాటు లేదని జె డ్పి చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పి చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలసి మేము సిద్ధం….మాబూత్‌ సిద్ధం కార్యక్రమాన్ని మండలంలోని బండ్లపల్లి, నెక్కుంది, ఏతూరు, గుడిసెబండ, కుమ్మరనత్తం బూత్‌ పరిధిలలో నిర్వహించారు. . ఈ సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు. జగనన్న జిందాబాద్‌….పెద్దిరెడ్డి జిందాబాద్‌…మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేసి, ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, జగన్‌మోహన్‌రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రచారాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 

 

Post Midle

జెడ్పి చైర్మన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదరికమే ప్రామాణికంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించి, ధైర్యంగా ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీనేనని కొనియాడారు. ఎన్నికల సమయంలో ప్రజలను మోసగించేందుకు వస్తున్న ఉమ్మడి పార్టీలు 2014 లో చేసిన మోసాలను గుర్తు చేసుకుని తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, సచివాలయ కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

 

Tags: Jagananna’s aim is to do what he says – ZP Chairman Srinivasulu

Post Midle