జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు శ్రీరామరక్ష
నందికొట్కూరు ముచ్చట్లు:
జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు శ్రీరామరక్ష లాంటిదని శాతనకోట గ్రామ సర్పంచ్ జనార్దన్ గౌడ్ అన్నారు. మండలంలోని శాతనకోట గ్రామంలో గురువారం అధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జనార్దన్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఆకాంక్షతోనే ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం, మందులను ప్రభుత్వమే అందజేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి సంజన్న పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, రవీంద్రబాబు, వైద్యులు మనోజ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Jagananna’s health care is Sri Rama’s protection for the poor
