జగనన్న సురక్షకు స్పందన
పుంగనూరుముచ్చట్లు:
పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇంటి వద్దనే చిక్సిలు నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మా శుక్రవారం తెలిపారు. మండలంలోని చండ్రమాకులపల్లెలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు మాధురి, దినేష్‌ప్రియ, శేషాద్రిరెడ్డితో పాటు వైద్యులు సృజన, తేజశ్వని, కిరణ్మయి , సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. వెహోత్తం 394 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో చక్కెర, రక్తపోటు ఉన్న 43మందిని గుర్తించారు. చిన్నపిల్లలు 10 మందికి, కంటి జబ్బులు కలిగిన 7 మందిని గుర్తించారు. మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ వైద్యశిబిరాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఇంటి వద్దనే వైద్యపరీక్షలు చేసి, చికిత్సలు చేయడంతో ప్రజలకు రోగ నిర్ధారణ ఇంటి వద్దనే జరుగుతోందన్నారు. దీని ద్వారా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ క్రింద రోగ గ్రస్తులు చికిత్సలు చేసుకునేందుకు వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Jagananna’s surakshak response
