పుంగనూరులో జగనన్నే సంక్షేమ పథకాలు ఇంకా కావాలి
పుంగనూరు ముచ్చట్లు:
దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మాకు ఎన్నటికి కావాలి…మా బ్రతుకులు బాగుపడాలి. ఇలాంటి ముఖ్యమంత్రి చిరకాలం ఉండాలని ఆశీర్వదిస్తున్నాం అంటు నవరత్నాలు అందుకుంటున్న లబ్ధిదారులు ముక్తకంఠంతో తెలిపారు. సోమవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, సచివాలయ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో జనన్నే మాభవిష్యత్తు …మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి, నాలుగు ప్రశ్నలకు జవాబులు స్వీకరించారు. సెల్‌ఫోన్లకు, ఇంటికి స్టిక్కర్లు అంటించారు. సంక్షేమ పథకాలు మాకు అన్ని అందుతున్నాయని , జగన్ మళ్లి ముఖ్యమంత్రి అవుతారని మహిళ లు తెలిపారు. పండుగ వాతావరణంలో సాగిన ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, గురివిరెడ్డి, శివకుమార్. చంద్రారెడ్డి యాదవ్, రమణ, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటిలో…
మున్సిపాలిటి పరిధిలో చైర్మన్ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, రాయలసీమ జిల్లా మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు…మా నమ్మజం నువ్వే జగన్ కార్యక్రమాన్ని సోమవారం ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటికి స్టిక్కర్లు అంటించి, సమాధానాలు సేకరించి, రశీదులు అందజేశారు. మున్సిపాలిటిలోని 31వ వార్డులలోను కౌన్సిలర్లు, గృహసారధులు, కన్వీనర్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇఫ్తికార్‌అలీ అహమ్మద్, శ్రీనివాసులు, రమణ, రాజేష్, సురేష్, మురళి, జావీద్, తదితరులు పాల్గొన్నారు.
Tags: Jagananne welfare schemes are still needed in Punganur
