Natyam ad

అవ్వాతాతలకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తున్న జగన్మోహన్..‌

హర్షపోగు ప్రశాంతి
 
నందికొట్కూర్ ముచ్చట్లు:
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇపింఛన్ పథకం ఆంధ్రప్రదేశ్ లోనే అగ్రస్థానంలో ఉండేవిధంగా 2500 రూపాయలకు పెంచిన ఘనత వారికే దక్కిందని నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ హర్షపోగు ప్రశాంతి ఈ సందర్భంగా సోమవారం నాడు తెలియజేశారు. నందికొట్కూరు నియోజకవర్గ వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రోద్బలం సహాయ సహకారాలతో ఈరోజు నేను నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నాని మా నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కల నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేసే విధంగా పని చేస్తామని మరియు చేస్తున్నాము అని హర్షపోగు ప్రశాంతి అన్నారు. వైస్సార్ పింఛన్ కానుక ఈ ఈ ఏడాది 2022 నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన 2500 రూపాయలు పెంచుతూ 2500రూపాయలు పింఛన్దారులకు అందించడం ద్వారా పింఛన్ దారులు ఆనందం వ్యక్తం చేశారని మునిసిపల్ వైస్ చైర్మన్  అర్షపోగు ప్రశాంతి  తెలిపారు.
 
 
పట్టణంలో కొత్తగా 95 పింఛన్లు మంజూరు అయినావి, పట్టణంలో మొత్తం పింఛన్లు 5073 ఉన్నాయని ఆమె తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ దారులకు పింఛన్ సొమ్మును అందిస్తున్న ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
నందికొట్కూరు నియోజకవర్గం వైస్సార్ ప్రభుత్వంలో మా ప్రియతమా నాయకులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారి నాయకత్వం లో నందికొట్కూరు పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొల్లెదుల రామకృష్ణ. గోవింద రెడ్డి. వెంకటరమణ. బుజ్జి. గ్రామ సచివాలయ సిబ్బంది. వాలంటీర్స్ పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Jaganmohan is giving a pension of Rs 2,500 to avatatas..‌