జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా 30 ఏళ్లు ఉండాలి -ఫకృద్ధిన్‌షరీఫ్
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ ఆకాంక్షించారు. మంగళవారం పట్టణంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదవి చేపట్టి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫకృద్ధిన్‌షరీఫ్ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల చిత్ర పట్టాలకు పాలాభిషేకం చేశారు. సీఎం జిందాబాద్ ….పెద్దిరెడ్డి జిందాబాద్ అంటు నినాదాలు చేశారు. స్వీట్లు పంపిణీ చేసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా 151 స్థానాలు సాధించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి 2024 ఎన్నికల్లో 151 స్థానాలతో ప్రభుత్వాన్ని చేపడుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుని, వారి అభివృద్ధిని కాంక్షించే జగనన్నకు ప్రతి ఒక్కరు ఆశీస్సులు అందించి, అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాజిదాబేగం, మైనార్టీ నాయకులు మహబూబ్‌బాషా, జావీద్ , తబషీర్, సుల్తాన్, ఇర్ఫాన్, ఇమ్రాన్, సుభాన్, షఫివుల్లా, నవాజ్, ఉమ్మర్‌తో పాటు మహిళలు పాల్గొన్నారు.

Tags:Jaganmohan Reddy should be CM for 30 years – Fakriddinsharif
