Natyam ad

మ్యానిఫెస్టోను అమలు చేసిన ఘనత జగనన్నదే

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామిలను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం అమలు చేసి, రికార్డు సృష్టించారని దళిత నేతలు రాజు, శంకరప్ప, కృష్ణప్ప కొనియాడారు. బుధవారం జగనన్నపాలనకు నాలుగేళ్లు అయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నవరత్నాలను ఏర్పాటు చేసి , సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని , జగన్‌మోహన్‌రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నరాయుడు, నరసింహులు, కుమార్‌, రామ్మూర్తి, బాలాజి, గంగాధరం, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Jaganna is credited with implementing the manifesto

Post Midle