జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం
వైసీపీ యువ నాయకులు గురునాథ్ రెడ్డి
కౌతాళం ముచ్చట్లు:
జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి అని వైసిపి నాయకులు గుర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ అంటిస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనేక సంక్షేమ పథకాలకు ప్రజలకు విద్యార్థులకు అందించడం జరిగిందన్నారు. ఇందులో అమ్మబడి, రైతు బరోస, జగనన్న తోడు, సచివాలయాలు ఏర్పాటు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు, వీటితో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్కు మరొకసారి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్ను కరపత్రాలను గ్రామ ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి శ్రీనివాసరెడ్డి జైపాల్ సచివాల సిబ్బంది వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Jaganna is our future, our belief
