Natyam ad

జగనన్న చిరకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలి

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని లబ్ధిదారులు ఆశీర్వదించారు. గురువారం పట్టణంలోని 7,8, 12 వార్డులలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌ ఇంటింటికి వెళ్లి జగనన్నే మా భవిష్యత్తు… మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు సిఆర్‌.లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, జెపి.యాదవ్‌, జయభారతి, మమతరాణి, నరసింహులు, ఆదిలక్ష్మీ, రాఘవేంద్ర, రేష్మా, భారతి, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్‌ ఖాన్‌, పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లారు. కరపత్రాలు పంపిణీ చేసి, నాలుగు ప్రశ్నలకు సమాదానాలు సేకరించారు. ప్రజల అనుమతితో స్టిక్కర్లు వేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ వరదారెడ్డి, నాయకులు రాజేష్‌, సురేష్‌, మహబూబ్‌బాషా, ఖాదర్‌బాషా, రమణ, సలామత్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; Jaganna should continue as chief minister for long

Post Midle