మంగళగిరిలో ఈ నెల 11 తేదిన జగన్నాధ రధయాత్ర

-ఇస్కాన్ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ

-ముఖ్య అతిధులుగా మంత్రి నారా లోకేష్,

-జగన్నాధుని రథయాత్రను జయప్రదం చేయాలని పిలుపు

 

మంగళగిరి ముచ్చట్లు:

 

మంగళగిరి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 11 వ తేదిన మంగళగిరి పట్టణంలో జగన్నాధ రధయాత్ర నిర్వహించటం జరుగుతుందని మంగళగిరి ఇస్కాన్ ప్రతినిధి సువర్ణ శ్రీనివాస దాసు తెలిపారు. మంగళగిరి బైపాస్ రోడ్డు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సువర్ణ శ్రీనివాస దాసు మాట్లాడుతూ దేశవాప్యంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల జగన్నాధ రధయాత్రలు నిర్వహించటం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈనెల 11వ తేది గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి బస్టాండ్ సెంటర్ నుండి జగన్నాధ రధయాత్ర ప్రారంభమౌతుందన్నారు.రాష్ట్ర ఐటీ, హ్యూమన్ రిసోర్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్ని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీనివాస దాసు తెలిపారు.మంగళగిరి బైపాస్ రోడ్డులోని బాపూజీ విద్యాలయ క్రీడా ప్రాంగణం వరకు రధయాత్ర కొనసాగుతుందన్నారు.బాపూజీ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 6 గంటలకు అభిషేకం, హారి నామ సంకీర్తన, రాత్రి 7 గంటలకు అలంకరణ, పూజా హారతి, భగవద సందేశం, 8 గంటలకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని తెలిపారు.

 

బాపూజీ విద్యాలయ ఆకాడమీ చైర్మన్ యార్రాకుల తులసీరామ్ యాదవ్ మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో తొలిసారిగా జరిగే జగన్నాధుని రధయాత్ర ను ఆధ్యాత్మికత వర్దిలే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖలు, పాల్గోంటారని తెలిపారు. ఈ నెల 11వ తేదిన జరిగే జగన్నాధ రధయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం రధయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.సమావేశంలో మంగళగిరి పిరిమిడ్ ధ్యాన మండలి అధ్యక్షులు ఆకురాతి శంకరరావు, బలరామ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పల్లెబాట రాజా తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Jagannadha Radhyatra on 11th of this month in Mangalagiri

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *