Natyam ad

జగనన్న సురక్ష వరం

పుంగనూరు ముచ్చట్లు:

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలకు వరంలాంటిదని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పూజగానిపల్లె జెడ్పి హైస్కూల్‌ నందు సురక్ష కార్యక్రమంలో ఎంపీపీ, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా పలువురు పిల్లలు, పెద్దలకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణ, మెడికల్‌ ఆఫీసర్‌ సల్మా, వైఎస్సార్‌సీపీ నాయకులు నరసింహులు, చంద్రారెడ్డి యాదవ్‌, బాబు, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Jagannana Suraksha Varam

Post Midle