జగనన్న సురక్షకు అపూర్వ స్పందన
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని భీమగానిపల్లె సచివాలయంలో సురక్ష శిబిరాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎంపీపీ ప్రారంభించారు. శిబిరంలో వైద్యులు నిరంజన్, ప్రశాంత్, సృజన, తేజశ్వని, కిరణ్మయి , సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. వెహోత్తం 285 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో చక్కెర, రక్తపోటు ఉన్న 63 మందిని గుర్తించారు. 29 మందికి వ్యాధి నిర్ధారణ చేసి మెరుగైన వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి పంపారు. ఎంపీపీ మాట్లాడుతూ వైద్యశిబిరాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఇంటి వద్దనే వైద్యపరీక్షలు చేసి, చికిత్సలు చేయడంతో ప్రజలకు రోగ నిర్ధారణ ఇంటి వద్దనే జరుగుతోందన్నారు. దీని ద్వారా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ క్రింద రోగ గ్రస్తులు చికిత్సలు చేసుకునేందుకు వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణ, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బోయకొండ చైర్మన్ నాగరాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, జయరామిరెడ్డి , జనార్ధన్, రమణ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags: Jagannana Surakshakar’s unprecedented response
